BRS Party | హైదరాబాద్ : మిర్యాలగూడలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సమక్షంలో టీపీసీసీ కార్యదర్శి అలుగుబెల్లి అమరేందర్‌రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మంత్రి కేటీఆర్ అమరేందర్ రెడ్డికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు, పలువురు నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్‌ను వీడి సొంత గూటికి రావడం సంతోషంగా ఉందని అమరేందర్ రెడ్డి పేర్కొన్నారు.
2018, 2023 ఎన్నికల్లో తనకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తామని చెప్పడంతోనే కన్నతల్లి లాంటి బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరినట్లు నిన్న మీడియాలో సమావేశంలో అమరేందర్ రెడ్డి చెప్పిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ అధిష్టానం తనకు టికెట్ ఇవ్వకుండా మోసం చేసిందని, తనకు కాకుండా ఇతరులకు టికెట్ కేటాయించి అవమాన పర్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో మిర్యాలగూడ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి నల్లమోతు భాస్కర్‌రావు గెలుపుకోసం కృషి చేస్తానన్నారు. నియోజకవర్గంలో అందరం కలిసి గులాబీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. తనను నమ్ముకొని వెంట వచ్చిన నాయకులు, కార్యకర్తలకు బీఆర్ఎస్లో తప్పక న్యాయం జరుగుతుందన్నారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి @KTRBRS గారి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన TPCC ప్రధాన కార్యదర్శి, మిర్యాలగూడ కాంగ్రెస్ నాయకుడు అలుగుబెల్లి అమరేందర్ రెడ్డి.#KCROnceAgain#VoteForCar @nbrmiryalaguda pic.twitter.com/JhFjdyQ6h6
— BRS Party (@BRSparty) November 18, 2023