హైదరాబాద్, మే 1 (నమస్తే తెలంగాణ): అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ కేంద్ర ప్రభు త్వ నిబంధనలు సమస్యాత్మకంగా మారాయి. ధాన్యంలో తేమ శాతం 17కు మించకూడదన్న ఎఫ్సీఐ నిబంధన ఇప్పుడు రైతుల పాలిట శాపంగా మారింది. అకాల వర్షాలతో ధాన్యం తడిసి తేమ శాతం అధికంగా ఉంటున్నది. తేమ శాతాన్ని 17 నుంచి 20కి పెంచితే రైతులకు ఊరట లభిస్తుందని రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ భావిస్తున్నది. ఈ మేరకు కేంద్రానికి లేఖ రాయనున్నట్టు తెలిసింది.
అకాల వర్షాలతో రైతులు నష్టపోతుంటే కేంద్ర ప్రభుత్వం నుంచి సాయం రాబట్టేందుకు రాష్ట్ర బీజేపీ ఎంపీలు, నేతలు కనీస ప్రయత్నాలు చేయకపోవడం విమర్శలకు తావిస్తున్నది. కేంద్రం నుంచి సాయం రాబట్టకపోగా తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తు న్న రాష్ట్ర ప్రభుత్వంపైనే నిందలు వేస్తున్నా రు. పక్షం రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా వడగం డ్ల వానలు బీభత్సం సృష్టిస్తున్నా కేంద్రంగానీ, బీజేపీ నేతలుగానీ స్పందించలేదు. మోదీ తెలంగాణ రైతులపై వివక్ష చూపు తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.