ప్రత్యామ్నాయ పంటలు సాగుచేయాలి
తెలంగాణలో ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో ఉద్యాన పంటల్లో ప్రత్యామ్నా య పంటల నిర్వహణ వ్యూహాలపై శ్రీ కొండాలక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం రూపొందించిన బులెటిన్‌ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. సోమవారం ప్రజాభవన్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార, మంత్రులు తుమ్మల, ఉత్తమ్, శ్రీధర్‌బాబుతో కలిసి విడుదల చేశారు.
- బులెటిన్ విడుదల చేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార, మంత్రులు
హైదరాబాద్, జూన్ 15 (నమస్తే తెలంగాణ) : తెలంగాణలో ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో ఉద్యాన పంటల్లో ప్రత్యామ్నాయ పంటల నిర్వహణ వ్యూహాలపై శ్రీ కొండాలక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం రూపొందించిన బులెటిన్‌ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. సోమవారం ప్రజాభవన్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార, మంత్రులు తుమ్మల, ఉత్తమ్, శ్రీధర్‌బాబుతో కలిసి విడుదల చేశారు. పంటలపై ఎల్‌నినో ప్రభావం, నష్టాలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ రైతులకు సలహాలు, సూచనలు అందించాలని అధికారులను, వర్సిటీ వీసీ డాక్టర్ దండ రాజిరెడ్డిని మంత్రులు కోరారు. 2026లో ఎల్‌నినో ప్రభావం కారణంగా, భారత వాతావరణ శాఖ అంచనాల ప్రకారం దేశవ్యాప్తంగా వర్షపాతం దీర్ఘకాల సగటు(ఎల్పీఏ)లో 90% మాత్రమే ఉండే అవకాశం ఉన్నదని వీసీ డాక్టర్ డీ రాజిరెడ్డి వివరించారు. తెలంగాణ మధ్య జిల్లాల్లో సాధారణం లేదా ఎకువ వర్షపాతం పడే అవకాశం ఉన్నదని, ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో తకువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నదని పేర్కొన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్యదర్శి సురేంద్ర మోహన్, వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, ఉద్యాన, పట్టు పరిశ్రమశాఖ డైరెక్టర్ షేక్ యాస్మిన్ భాషా పాల్గొన్నారు.
రాష్ర్టాలపై భారం సరికాదు : తుమ్మల
పంటల మార్పిడీని ప్రభుత్వం ప్రాధాన్యతగా తీసుకున్నదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని రైతులకు సూచించారు. సోమవారం నాంపల్లిలోని మార్క్‌ఫెడ్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. పంటల కొనుగోళ్లలో కేంద్ర ప్రభుత్వం చూపిస్తున్న వివక్ష బాధాకరమని తెలిపారు. కేంద్రం తన బాధ్యత వదిలివేసి రాష్ట్రాలపై భారం మోపడం సమంజసం కాదని మండిపడ్డారు. పరిమితి లేకుండా పొద్దుతిరుగుడు కొనుగోలు చేయాలని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

