హైదరాబాద్, ఏప్రిల్ 7(నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్‌రెడ్డితోపాటు మంత్రులంతా గుజరాత్లో మకాం వేయనున్నారు. ఈనెల 8,9 తేదీల్లో రెడ్రోజులపాటు గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో సీడబ్ల్యూసీ సమావేశాలతోపాటు, ఏఐసీసీ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో పాల్గొనేందుకు సోమవారం రాత్రి మంత్రులు భట్టి విక్రమార్క, పొంగులేటి, సీతక్క, పొన్నం ప్రభాకర్ వెళ్లగా, మంగళవారం ఉదయం సీఎం రేవంత్‌రెడ్డితోపాటు ఇతర మంత్రులు వెళ్లనున్నారు. దీంతో రాష్ట్ర క్యాబినెట్ మొ త్తం రెండురోజులపాటు గుజరాత్‌లోనే గడపనున్నది. ఈ నేపథ్యంలో సీఎం, మంత్రుల గుజరాత్ పర్యటనపై పెద్దఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
బీసీ డిక్లరేషన్ హామీలు అమలు చేస్తున్నం ; ‘చింతన్ శిబిర్’లో పొన్నం, సీతక్క
హైదరాబాద్, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ): బీసీ డిక్లరేషన్ హామీలన్నింటినీ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్నదని బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మహిళా శిశుసంక్షేమశాఖ మంత్రి సీతక్క వెల్లడించారు. కేంద్ర సామాజికన్యాయం, సాధికారతశాఖ ఆధ్వర్యంలో ఉత్తరాఖండ్ రాష్ట్రం డెహ్రాడూన్‌లో ఏర్పాటు చేసిన రెండ్రోజుల చింతన్ శిబిర్ కార్యక్రమం కేంద్ర సామాజికన్యాయ మంత్రి డాక్టర్ వీరేంద్రకుమార్ అధ్యక్షతన సో మవారం జరిగింది. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్, సీతక్క మాట్లాడు తూ రేవంత్‌రెడ్డి నాయకత్వంలో కులగణనతోపాటు, బీసీ డిక్లరేషన్ హామీలు అమలు చేస్తున్నామని తెలిపారు.