నాంపల్లి క్రిమినల్ కోర్టులు, జనవరి 3: సినీనటుడు అల్లు అర్జున్‌కు భారీ ఊరట లభించింది. ‘పుష్ప-2’ చిత్రం బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగి ఓ మహిళ మరణించిన కేసులో ఆయనకు షరతులతో కూడిన రెగ్యులర్ బెయిల్‌ను నాంపల్లి కోర్టు మంజూరు చేసింది.
2వ అదనపు జిల్లా కోర్టు జడ్జి వినోద్‌కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు.