హైదరాబాద్, డిసెంబర్ 11(నమస్తే తెలంగాణ): పుష్ప-2 సినిమా ప్రదర్శన సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొకిసలాటలో ఓ మహిళ మరణించడంపై చికడపల్లి పోలీసులు తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ ఆ సినిమా హీరో అల్లుఅర్జున్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అర్జున్ థియేటర్‌కు రావడం వల్ల తొకిసలాట జరిగి తన భార్య రేవతి మరణించిందని, కుమారుడు, కుమార్తె గాయపడ్డారని పేర్కొంటూ భాసర్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. చికడపల్లి పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టేయాలంటూ ఇప్పటికే థియేటర్ యాజమాన్యం, భాగస్వాములు పిటిషన్లు దాఖలు చేశారు.
అల్లుఅర్జున్ కూడా బుధవారం పిటిషన్ దాఖలు చేశారు. సినిమా విడుదల సందర్భంగా థియేటర్లకు నటులు వెళ్తుంటారని, ఇది సహజంగా జరిగేదేనని తెలిపారు. ఇదివరకు కూడా పలుమార్లు సినిమా ప్రదర్శనల సమయంలో తాను వెళ్లినట్టు గుర్తుచేశారు. ఎప్పుడూ ఇలాంటి సంఘటనలు చోటుచేసుకోలేదని తెలిపారు. సంధ్య థియేటర్‌కు వెళ్లేముందు తాను థియేటర్ నిర్వాహకులకు, స్థానిక ఏసీపీ తదితర పోలీసు అధికారులకు సమాచారం ఇచ్చినట్టు పేర్కొన్నారు. భద్రత కోసం ముందస్తుగా సమాచారం ఇచ్చామన్నారు. ఇందులో తన నిర్లక్ష్యమేమీ లేదని తెలిపారు. తాను థియేటర్‌కు వెళ్లిన కారణంగానే తొకిసలాట జరిగిందని మృతురాలి భర్త ఫిర్యాదులో పేరొనడం సరికాదని అన్నారు. ఎఫ్ఐఆర్లో పోలీసులు నమోదు చేసిన అభియోగాలేవీ తనకు వర్తించవని తెలిపారు. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని, విచారణ ప్రక్రియను నిలిపివేయాలని, ఈలోగా తనను అరెస్టు చేయకుండా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఈ పిటిషన్‌పై గురువారం విచారణ జరిగే అవకాశం ఉంది.