Minister KTR | దావోస్ వేదికగా తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతున్నది. పలు ప్రతిష్టాత్మక సంస్థలు హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు అంగీకారం తెలిపాయి. పలు సంస్థలు తమ కార్యకలాపాలను రెట్టింపు చేయనున్నట్లు ప్రకటించాయి. ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు సందర్భంగా దావోస్‌లోని తెలంగాణ పెవిలియన్‌లో ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ పెప్సికో సంస్థ ఉపాధ్యక్షుడు రాబర్డో అజేవేడోతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో సంస్థ కార్యకలాపాలు రెట్టింపు చేయనున్నట్లు ఈ సందర్భంగా ప్రకటించారు.
PepsiCo Global Business Services Centre to expand big in Telangana!@robertocazevedo, EVP Corporate Affairs @PepsiCo met Minister @KTRTRS at Telangana Pavilion on the sidelines of #wef23, Davos and discussed various plans of the company in Telangana State.#TelanganaAtDavos pic.twitter.com/q9i32SuBZq
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) January 17, 2023
2019లో 250 మందితో ప్రారంభమైన గ్లోబల్ బిజినెస్ సర్వీసెస్ సెంటర్లో ప్రస్తుతం 2800 మంది ఉద్యోగులు పని చేస్తున్నట్లు తెలిపారు. ఈ సంఖ్యను 4వేలకు పెంచనున్నట్లు చెప్పారు. ఏడాదిలో అదనపు ఉద్యోగులను నియమించుకోవడంతో పాటు సంస్థ కార్యకలాపాలను భారీగా విస్తరిస్తామని చెప్పారు. గ్లోబల్ బిజినెస్ సర్వీస్ సెంటర్ విస్తరణతో పాటు రాష్ట్రంలో పెప్సీకో ఇతర విభాగాల విస్తరణ అవకాశాలపై రాబర్టోతో కేటీఆర్ చర్చించారు. పెక్సికో నిర్ణయంపై కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. కంపెనీ విస్తరణ ప్రణాళికలకు అవసరమైన సహాయ సహకారాలు ప్రభుత్వం తరఫున అందిస్తామని హామీ ఇచ్చారు.
తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు అలాక్స్ సంస్థ ముందుకు వచ్చింది. బ్యాటరీల తయారీలో అలాక్స్ సంస్థకు ఎంతో పేరుంది. రూ.750కోట్లతో మల్టీ గిగావాట్ లిథియం క్యాథోడ్ మెటీరియల్ తయారీ కేంద్రం ఏర్పాటు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో లిథియం ఐరన్ ఫాస్పేట్ యాక్టివ్ బ్యాటరీలు ఉత్పత్తి చేయనున్నారు. దావోస్‌లో కేటీఆర్ సమక్షంలో అలాక్స్ సంస్థ ప్రతినిధులు, తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. రూ.210కోట్ల పెట్టుబడితో మొదట మూడు గిగావాట్ల సామర్థ్యంతో లిథియం ఐరన్ ఫాస్పేట్ బ్యాటరీలను ఉత్పత్తి చేస్తామని, భవిష్యత్‌లో పది గిగావాట్లకు పెంచి.. 2030 నాటికి మొత్తంగా రూ.750కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు కంపెనీ పేర్కొంది.
Good news from @Davos!
Allox announced to set up India’s First multi-GW Lithium Cathode Material – LFP manufacturing unit in #Telangana. The 3 GWH/PA capacity state-of-the-art facility with an investment of ₹210 Cr will be expanded to 10 GWH/PA with ₹750 Cr by 2030.#WEF23 pic.twitter.com/cAfeZCQU8d
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) January 17, 2023
తెలంగాణ ప్రభుత్వ భాగస్వామ్యంతో హైదరాబాద్‌లో డిజిటల్ ఇన్నోవేషన్ సెంటర్ ప్రారంభించనున్నట్లు అపోలో టైర్స్ లిమిటెడ్ తెలిపింది. లండన్ తర్వాత తమ రెండో డిజిటల్ ఇన్నోవేషన్ సెంటర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్నట్లు సంస్థ పేర్కొంది. దావోస్‌లో మంత్రి కేటీఆర్ సమక్షంలో.. తెలంగాణ ప్రభుత్వంతో ఆ సంస్థ వీసీ ఎండీ నీరజ్ కన్వర్ ఒప్పందం కుదుర్చుకున్నారు. నాలుగో పారిశ్రామిక విప్లవంలో భాగంగా వినూత్న సాంకేతికతతో కొత్త వ్యాపార నమూనాలు అభివృద్ధి, వినియోగదారులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంలో ఈ డిజిటల్ ఇన్నోవేషన్ కేంద్రం ప్రధాన పాత్ర పోషిస్తుందని అపోలో టైర్స్ తెలిపింది. వినూత్న ఆవిష్కరణలకు ఊతమిచ్చేలా రాష్ట్రంలో ఏర్పడిన అద్భుత వ్యవస్థకు అపోలో డిజిటల్ ఇన్నోవేషన్ సెంటర్ సరైన జోడింపుగా కేటీఆర్ తెలిపారు.
Another major announcement from Davos!
Apollo Tyres Ltd to set up its Digital Innovation Centre in Hyderabad.
The announcement came after the @apollotyres leadership team met Minister @KTRTRS at Telangana Pavilion during the ongoing #wef23 in Davos.#TelanganaAtDavos pic.twitter.com/CYJIuxhnKt
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) January 17, 2023