అమరావతి : రెండు తెలుగు రాష్ట్రాలకు యువ ట్రైనీ ఐపీఎస్ (Trainee IPS) లను కేటాయిస్తూ కేంద్రం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) కు హరియాణాకు చెందిన దీక్ష, తమిళనాడుకు చెందిన సుష్మిత, ఏపీకి చెందిన బొడ్డు హేమంత్(Boddu Hemanth) , మనీషా వంగల రెడ్డిలను కేటాయించింది.
తెలంగాణ (Telangana) కు జమ్మూకశ్మీర్‌కు చెందిన మనన్ భట్(Manan Bhatt) , తెలంగాణకు చెందిన రుత్విక్ సాయి కొట్టే, సాయి కిరణ్, ఉత్తర ప్రదేశ్‌కు చెందిన యాదవ్ వసుంధరను కేటాయించారు.