హైదరాబాద్, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ): నూతనంగా బాధ్యతలు చేపట్టిన రాష్ట్ర మంత్రులకు సెక్రటేరియట్లో ప్రభు త్వం చాంబర్లను కేటాయించింది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఐదో అంత స్థు వరకు 11 మంది మంత్రులకు కార్యాలయాలను కేటాయించారు.