మల్కాజిగిరి, వినాయక్‌న గర్: బొల్లారంలోని తెలంగాణ, ఆంధ్ర సబ్ ఏరియా హెడ్ క్వార్టర్స్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్(జీఓసీ) వీఎస్ఎం శ్రీనివాస్‌తో శుక్రవారం మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మర్రి మాట్లాడుతూ.. ప్రజా అవసరాల కోసం డైరీ ఫామ్ రోడ్డులోని ఆర్మీ స్థలం ఒక ఎకరాన్ని డంపింగ్ యార్డ్‌కు కేటాయించాలని కోరారు.
ఏఓసీ రోడ్ల నిర్మాణం కోసం టెండర్ ప్రక్రియ పూర్తయినందున నిర్మాణ పను లు ప్రారంభించడానికి అనుమతివ్వాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు జీకే హన్మంతరావు, జేఏసీ వెంకన్న, లక్ష్మణ్ యాదవ్, శ్రీనివాస్, రాజు యాదవ్, నర్సింగరావు, చక్రపాణి రెడ్డి, ఫాదర్ వినయ్ రెడ్డి, భరత్ తదితరులు పాల్గొన్నారు.