హైదరాబాద్, జూన్ 11 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ మ్యానిఫెస్టోలోని హామీలన్నీ వంద రోజుల్లోనే అమలు చేస్తామన్న రేవంత్‌రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టాక మరిచిపోయారని బీజేపీ ఎల్పీ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి విమర్శించారు. బుధవారం ఆయన సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని కోరారు. లోక్‌సభ ఎన్నికల పేరిట రైతు రుణమాఫీని ఆగస్టు 15కు వాయిదా వేసి రైతుల నమ్మకాన్ని కోల్పోయారని ఎద్దేవా చేశారు. దీని ఫలితంగా ఎన్నికల్లో కాంగ్రెస్ భంగపాటుకు గురైందని పేర్కొన్నారు.