కడెం, మార్చి 7: ఇంటర్ ప్రశ్నాపత్రం లీకు ఆరోపణలపై నిర్మల్ జిల్లా కడెం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చీఫ్ సూపరింటెండెంట్ రాజన్న, డిపార్ట్మెంటల్ ఆఫీసర్ నాగరాజుకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్టు నిర్మల్ జిల్లా ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషనల్ అధికారి (డీఐఈవో) జాదవ్ పరశురాం శుక్రవారం తెలిపారు.
ఫోన్ ద్వారా పరీక్షా పత్రం లీకైనట్లు ఆరోపణలు రావడంతో గురువారం నిర్మల్ ఏఎస్పీ రాజేశ్మీనా, ఖానాపూర్ సీఐ సైదారావు, కడెం ఇన్చార్జి ఎస్ఐ శంకర్, ఇతర సిబ్బంది ఇంటర్ పరీక్షా కేంద్రానికి చేరుకొని సంబంధిత పరీక్షల డిపార్ట్మెంట్ అధికారి, ఇన్విజిలేటర్ల ఫోన్లను తనిఖీ చేసిన విషయం తెలిసిందే.