హైదరాబాద్, మార్చి 26(నమస్తే తెలంగాణ) : తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబరేటరీ (ఎఫ్ఎస్ఎల్)లో ఇటీవల సైంటిఫిక్ ఆఫీసర్, సైంటిఫిక్ అసిస్టెంట్ వంటి 60 ఖాళీలకు చేపట్టిన ఉద్యోగ నియామకాల్లో తీవ్ర అవకతవకలు జరిగినట్టు పలువురు అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. నియామకాలు చాలా పకడ్బందీగా నిర్వహిస్తారనే పేరున్న పోలీసు రిక్రూట్మెంట్ బోర్డుకు ఇది మాయని మచ్చ అని అంటున్నారు. తెలంగాణ ఎఫ్ఎస్ఎల్ విభాగంలో సైంటిఫిక్ ఆఫీసర్, సైంటిఫిక్ అసిస్టెంట్ (బయాలజీ/సెరాలజీ) పోస్టుల ఎంపిక ప్రక్రియలో అకడమిక్ మారుల లెకింపులో తీవ్ర అన్యాయం జరిగిందని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. నోటిఫికేషన్ నిబంధనల ప్రకారం కేవలం కోర్ సబ్జెక్టుల మారులు మాత్రమే లెకించాలి. కానీ, కొందరు అభ్యర్థులకు లాంగ్వేజ్ మారులను కూడా కలిపి 2,200 మారులకు గ్రేడింగ్ ఇచ్చారని, మరికొందరికి మాత్రం కేవలం 1,800 మారులకు మాత్రమే లెకించారని అంటున్నారు. లాంగ్వేజెస్ మార్కులు కలిపి లెక్కించకూడదన్న నిబంధనను తుంగలో తొక్కారని, ఆ విషయం బోర్డు నిబంధనల్లో పేర్కొని కూడా వారే ఉల్లంఘించారని అభ్యర్థులు ‘నమస్తే తెలంగాణ’తో వాపోయారు.
తెలంగాణ రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్)లో 13 విభాగాల్లో వివిధ పోస్టుల భర్తీకి సంబంధించి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ జనవరి 20 నుంచి 31 వరకు జరిగింది. పరిశీలనాధికారులు సర్టిఫికెట్లను ఫిజికల్‌గా చెక్ చేయకుండానే.. తూతూమంత్రంగా నిర్వహించారని బాధిత అభ్యర్థులు ఆరోపించారు. దరఖాస్తు చేసుకున్నప్పుడు కొందరు అభ్యర్థులు లాంగ్వేజెస్ మార్కులు కూడా కలిపి చూపించారని, మరికొందరు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ అప్పుడు ఆ మార్కులు యాడ్ చేసుకోవడం వల్ల.. వారికే అవకాశాలు వచ్చాయని, తమకు తీవ్రంగా అన్యాయం జరిగిందని వాపోతున్నారు. ఐదేండ్ల ఇంటిగ్రేటెడ్ డిగ్రీ అభ్యర్థులకు, సాధారణ మూడేండ్ల డిగ్రీ అభ్యర్థులకు ఒకే రకమైన నిబంధనలు పాటించకుండా, మారులను ఇష్టానుసారంగా కలపడంవల్ల మెరిట్ అభ్యర్థులు నష్టపోయారని అంటున్నారు. ఎంపిక జాబితాలో అభ్యర్థుల మధ్య తేడా పాయింట్లలోనే ఉందని, ఇలా తప్పుగా లాంగ్వేజ్ మారులు కలపడం వల్ల అవకాశాలను కోల్పోతున్నామని చెప్పారు.
ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్‌లోని అభ్యర్థులందరి అకడమిక్ మారులను మరోసారి రీ-వెరిఫై చేయాలని బాధిత అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. అందరికీ సమానమైన, పారదర్శకమైన లెకింపు పద్ధతిని అమలుచేయాలని కోరుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా మారులు పొందినవారిని తొలగించి, మెరిట్ అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తమకు న్యాయం జరగని పక్షంలో ఉన్నతాధికారులను, కోర్టును ఆశ్రయిస్తామని అభ్యర్థులు హెచ్చరిస్తున్నారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ టైమ్‌కు అన్ని సర్టిఫికెట్లు ఇవ్వాలనే నిబంధన ఉన్నా.. కొందరు ఆ సమయానికి సర్టిఫికెట్లు తీసుకురాలేకపోతే.. వారితో లెటర్ రాయించుకొని మరీ ఫేవర్ చేశారని వాపోతున్నారు. రిక్రూట్మెంబ్ బోర్డు చైర్మన్ వీవీ శ్రీనివాసరావు తమకు అవకాశం ఇస్తే.. ఆధారాలతో సహా నిరూపిస్తామని అంటున్నారు. లేకపోతే కచ్చితంగా న్యాయస్థానాల్లోనే తేల్చుకుంటామని హెచ్చరించారు.