చౌటుప్పల్ : దేశ ప్రజలంతా సీఎం కేసీఆర్ నాయకత్వం వైపే చూస్తున్నారని, ఇలాంటి నాయకుడే తమ కావాలని ఆకాంక్షిస్తున్నారని విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు. చౌటుప్పల్ మున్సిపాలిటీలో నిర్వహించిన టీఆర్ఎస్ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనం వనభోజన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
తెలంగాణలో సీఎం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు పక్క రాష్ట్రాల ప్రజలు అబ్బుర పడుతున్నారని పేర్కొన్నారు. ఇలాంటి నాయకుడే తమకు కావాలని ఆకాంక్షిస్తున్నారని తెలిపారు. కేసీఆర్ వస్తేనే తెలంగాణలోని పథకాలు తమ రాష్ట్రాల్లో అమలు అవుతాయని ఆశపడుతున్నారని పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్ ఫ్లోరైడ్ రక్కసిని కేవలం ఆరేండ్ల కాలంలోనే రూపుమాపారన్నారు. లక్షల కోట్లతో ఈ ప్రాంతంలో అనేక సాగునీటి ప్రాజెక్టులకు అంకురార్పర చేశారని తెలిపారు.
సీఎం ఆకాంక్ష మేరకు మనందరం నడుచుకుందామని, ఏ పిలుపునిచ్చినా కంకణ బద్ధులమై పని చేద్దామని తెలిపారు.
కార్యక్రమంలో ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు, ఎమ్మెల్యేలు సైదిరెడ్డి, మల్లయ్య యాదవ్, భాస్కర్ రావు, కిషోర్ కుమార్, లింగయ్య, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి, మార్కెట్ చైర్మన్ బొడ్డు శ్రీనివాస్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి, టీఆర్ఎస్ మున్సిపాలిటీ, మండల అధ్యక్షులు ముత్యాల ప్రభాకర్ రెడ్డి, గిర్కటి నిరంజన్ గౌడ్, యూత్ అధ్యక్షుడు నారెడ్డి అభినందన్ రెడ్డి పాల్గొన్నారు.