మహబూబ్‌నగర్, నమస్తే తెలంగాణ ; ఉద్దండాపూర్ జలాశయం వద్ద నిర్వహిస్త్తున్న పనుల్లో ఓ ఆసక్తికర దృశ్యం కనిపించింది. సర్జిపూల్ లోపల రాతిగోడపై జాలువారుతున్న నీటి బిందువులన్నీ కలిసి కేసీఆర్ ప్రతిరూపాన్ని ఆవిష్కరించాయి. సర్జిపూల్ చుట్టూ రాతిపలకలున్నా ఈ ఒక్కచోటే కేసీఆర్ జలచిత్రం సాక్షాత్కరించింది. అచ్చు కేసీఆర్‌లా ఉన్న ఆ చిత్రాన్ని చూస్తూ అక్కడ పనిచేస్తున్నవారంతా ఉప్పొంగిపోతున్నారు. ప్రతిరోజూ సీఎం కేసీఆర్ ఇలా వచ్చి ప్రాజెక్టు పనులను పరిశీలించి వెళ్తున్నారంటూ రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తున్నారు. కేసీఆర్ ప్రతిరూపం సాక్షిగా.. ప్రాజెక్టులోనే అతి కీలకమైన ఉద్దండాపూర్ రిజర్వాయర్ పనులను వడివడిగా పూర్తిచేసేందుకు కార్మికులు, ఇంజినీర్లు శ్రమిస్తున్నారు.