హైదరాబాద్, మే5 (నమస్తే తెలంగాణ): బీసీ సంక్షేమ సంఘాల రాష్ట్ర కమిటీలన్నింటినీ రద్దు చేస్తున్నట్టు సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ మంగళవారం ప్రకటించారు. దేశవ్యాప్తంగా మారుతున్న రాజకీయ పరిణామాలు చూస్తే తెలంగాణలోనూ బీసీలు రాజ్యాధికారం కైవసం చేసుకునే పరిస్థితులున్నాయని తెలిపారు. సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బైరి రవికృష్ణ, రాష్ట్ర కార్యవర్గ అధ్యక్షుడు కులచర్ల శ్రీనివాస్, నేతలు పాల్గొన్నారు.