హైదరాబాద్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): తెలంగాణ వ్యక్తి జస్టిస్ సుదర్శన్‌రెడ్డిని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఇండియా కూటమి ఎంపిక చేసిందని, తెలుగు రాష్ర్టాల్లోని అన్ని రాజకీయ పార్టీలు ఆయనకు మద్దతునివ్వాలని సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. మంగళవారం తన నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జస్టిస్ సుదర్శన్‌రెడ్డికి మద్దతునివ్వాలని టీడీపీ, బీఆర్ఎస్, వైసీసీ, బీజేపీలకు విజ్ఞప్తి చేశారు. సుదర్శన్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాదని, రాజకీయాలతో ఆయనకు సంబంధం లేదని తెలిపారు. రాజ్యాంగాన్ని రక్షించేందుకు ఆయనకు మద్దతిచ్చి గెలిపించాల్సిన అవసరం ఉందని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.