హైదరాబాద్, జనవరి 27(నమస్తే తెలంగాణ) : పులుల గణన కోసం ఇటీవల రాష్ట్ర అటవీ శాఖ నిర్వహించిన సర్వేలో విషాద ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ సర్వేలో పాల్గొన్న ఓ అటవీ వాచర్ గుండెపోటుతో మృతిచెందగా, ఎలుగుబంటి దాడిలో ఒక రు గాయపడ్డారు. మరో వలంటీర్‌కు కాలు విరిగినట్టు అటవీ శాఖ అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో ఈ నెల 19 నుంచి 25 వరకు పులుల గణన సర్వే ముగిసింది.
మేడారం జాతర నేపథ్యంలో ములుగు జిల్లా మినహా 32 జిల్లాల్లో 6 రోజుల్లో సర్వే పూర్తయిందని మంగళవారం అధికారులు తెలిపారు. సమాచారాన్ని ఎం-్రైస్టెప్స్ యాప్‌లో నమోదు చేసి, వైల్డ్‌లైఫ్ ఇన్స్టిట్యూట్ రిమోట్ సర్వర్‌కు అప్లోడ్ చేసినట్టు తెలిపారు. 552 పెద్ద శాకాహార జంతువుల ఆధారాలను గుర్తించామని పేర్కొన్నారు.
కథలాపూర్, జనవరి 27 : జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం సిరికొండకు చెందిన ముంజ స్కైలాల్గౌడ్(45) గల్ఫ్‌లో గుండెపోటుతో మృతిచెందా డు. స్కైలాల్గౌడ్ పదేండ్లుగా అబుదాబిలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఈ నెల 26న స్కైలాల్గౌడ్కు క్యాంపులోనే గుండెనొప్పి రావడంతో తోటిమిత్రులు దవాఖానలో చేర్పించారు.
పరిస్థితి విషమించి సోమవారం మృతిచెందినట్టు అక్కడివారు కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. మృతదేహాన్ని స్వగ్రామానికి రప్పించేందుకు ప్రభుత్వం చొరవ చూపాలని కుటుంబసభ్యులు వేడుకుంటున్నారు.