హైదరాబాద్, జూలై 3(నమస్తే తెలంగాణ) : ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ నెల 6న ప్రజాభవన్లో సమావేశం కానున్న నేపథ్యంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి బుధవారం ఏర్పాట్లను పరిశీలించారు. ప్రజాభవన్లో సమావేశం కోసం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని భట్టి అధికారులకు సూచించారు. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ప్రజావాణి ప్రత్యేక కార్యదర్శి దివ్య, రహదారులు, భవనాల శాఖ ప్రత్యేక కార్యదర్శి హరిచందన, ప్రొ టోకాల్ విభాగం డైరెక్టర్ వెంకటరావు తదితరులు డిప్యూటీ సీఎంకు ఏర్పాట్ల గురించి వివరించారు.