Glucose Bottle | గ్లూకోజ్ బాటిల్లో నాచు ప్రత్యక్షం.. ఆరోగ్య శాఖ అధికారులపై ఆగ్రహం
Glucose Bottle | రోగులకు ఎక్కించే గ్లూకోజ్ బాటిల్లో నాచు ప్రత్యక్షమైంది. దీంతో రోగి కుటుంబ సభ్యులు ఆరోగ్య శాఖ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Glucose Bottle | మహబూబాబాద్ : రోగులకు ఎక్కించే గ్లూకోజ్ బాటిల్లో నాచు ప్రత్యక్షమైంది. దీంతో రోగి కుటుంబ సభ్యులు ఆరోగ్య శాఖ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలోని దంతాలపల్లి మండలం కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వెలుగు చూసింది.
దంతాలపల్లి మండలంలోని దాట్ల గ్రామానికి చెందిన నరకుటి సునీత అనే మహిళ తీవ్ర అనారోగ్యానికి గురైంది. దీంతో ఆమె దంతాలపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లింది. డాక్టర్ అందుబాటులో లేరని చెప్పి, అక్కడున్న సిబ్బంది ఓ రెండు గ్లూకోజ్ బాటిల్స్‌ను రోగికి అందజేశారు. ఇంటికి వెళ్లి గ్లూకోజ్ ఎక్కించుకోవాలని ఆమెకు సూచించారు. బాధితురాలు ఇంటికి చేరుకుని, గ్రామంలోని ఆర్ఎంపీ డాక్టర్‌ను సంప్రదించింది. ఒక గ్లూకోజ్ బాటిల్లో నాచు ఉండడాన్ని ఆర్ఎంపీ డాక్టర్ గమనించి, ఆమెకు సూచించాడు. దీంతో షాక్‌కు గురైన బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోగ్య శాఖ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై విచారణ జరిపి ఆరోగ్య శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

