Alexander | ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీ ఇంగ్లీష్ విభాగంలో పాల శ్రీనివాస్ అలియాస్ అలెగ్జాండర్ డాక్టరేట్ సాధించారు. ప్రొఫెసర్ మురళీకృష్ణ పర్యవేక్షణలో “యూజ్ ఆఫ్ డిజిటల్ రిసోర్సెస్ ఫర్ రీఎన్ఫోర్సింగ్ ది ఇంగ్లీష్ కమ్యూనికేషన్స్ స్కిల్స్ ఆఫ్ లెర్నర్స్ ఎట్ ద టెర్షరీ లెవెల్” అనే అంశంపై పరిశోధన పూర్తి చేసి అలెగ్జాండర్ సమర్పించిన పరిశోధనా గ్రంథాన్ని పరిశీలించిన ఓయూ ఎగ్జామినేషన్ బ్రాంచ్ అధికారులు ఆయనకు పీహెచ్డీ పట్టాను ప్రదానం చేస్తున్నట్లు ఒక ప్రకటన విడుదల చేశారు. విద్యార్థి దశలో టిఆర్ఎస్వి, ఎంఎస్ఎఫ్లలో క్రియాశీలకంగా పని చేసిన ఆయన ప్రత్యేక తెలంగాణ ఉద్యమంతో పాటు ఆత్మగౌరవ ఉద్యమాల్లో కీలకంగా వ్యవహరించారు. ఈ సందర్భంగా ఆయనను పలువురు అధ్యాపకులు, అధికారులు, విద్యార్థి నాయకులు, పరిశోధక విద్యార్థులు అభినందించారు.