హైదరాబాద్, మే18 (నమస్తే తెలంగాణ): లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విచ్చలవిడిగా ఓటర్లకు డబ్బులు పంచిందని బీజేపీ శాసనసభా పక్షనేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. సెక్రటేరియట్ వద్ద శనివారం మీడియా చిట్‌చాట్‌లో పలు అంశాలపై ఆయన స్పందించారు.
మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో తనకు 15 ఏండ్లుగా మాటల్లేవని తెలిపారు. ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, చేవెళ్ల, మహబూబ్‌నగర్, మలాజిగిరి, సికింద్రాబాద్, జహీరాబాద్‌లో కచ్చితంగా గెలుస్తామని, భువనగిరి, వరంగల్ టఫ్ ఫైట్ ఉన్నదని, నాగర్‌కర్నూల్ కూడా గెలిచే అవకాశం ఉన్నదని అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఎప్పటికైనా తాము అధికారంలోకి వస్తామని చెప్పారు.