హైదరాబాద్, ఫిబ్రవరి 17 (నమస్తేతెలంగాణ) : తిరుమల శ్రీవారి మేనెల దర్శనానికి సంబంధించిన టికెట్లు విడుదల చేయడానికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సిద్ధమైంది. మంగళవారం ఉదయం 10 గంటలకు లక్కీడిప్ విధానంలో కేటాయించే ఆర్జిత సేవతోపాటు ఈనెల 24వరకు జరిగే అన్ని కార్యక్రమాలకు సంబంధించి టికెట్లను విడుదల చేయన్నుట్టు టీటీడీ వెల్లడించింది.
టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఫొటో వాట్సాప్ డీపీగా పెట్టిన ఓ కేటుగాడు.. భక్తుల నుంచి అందినకాడికి డబ్బు దోచుకున్నాడు. వీఐపీ బ్రేక్ దర్శనం, సుప్రభాత సేవ, ఆర్జిత టికెట్లు అందుబాటులో ఉన్నాయని, కావాల్సిన వారు తనను సంప్రదించాలని వాట్సాప్ గ్రూపులో పోస్టులు పెట్టాడు. ప్రొఫైల్ పిక్ టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఫొటో ఉండటంతో నిజమని నమ్మి నిండా మునిగారు. విషయాన్ని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు దృష్టికి తీసుకెళ్లగా… కేటుగాడి బాగోతం బయటపడింది. ఫోన్ నంబర్ ఆధారంగా మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని హైదరాబాద్ ఓల్డ్ సిటీకి చెందిన మహ్మద్ ఖాన్‌గా గుర్తించారు. ఈఘటనపై సమగ్ర విచారణ జరిపి, కఠిన చర్యలు తీసుకోవాలని విజిలెన్స్, పోలీసు అధికారులను టీటీడీ చైర్మన్ ఆదేశించారు.