హైదరాబాద్ : రాష్ట్రంలో మద్యం ధరలు పెరిగాయి. పెరిగిన ధరలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. లిక్కర్‌పై 20 నుంచి 25 శాతం పెంచారు. వెయ్యి ఎంఎల్ లిక్కర్‌పై రూ. 120 పెంచడంతో.. ధర రూ. 495 నుంచి రూ. 615కు పెరిగింది. లిక్కర్ క్వార్టర్ సీసాపై రూ. 20 పెంచింది. అన్ని రకాల బీర్లపై రూ. 10 చొప్పున ప్రభుత్వం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.
ధరల పెంపు కారణంగా బుధవారం రాత్రి విక్రయాలు ముగిసిన తర్వాత రాష్ట్రంలోని అన్ని వైన్స్, బార్, రెస్టారెంట్లను ఆబ్కారీశాఖ అధికారులు సీజ్‌చేశారు. ఆయా దుకాణాల్లో ఉన్న స్టాక్ వివరాలు సేకరించారు. ఇప్పటికే దుకాణదారులు మద్యం డిపోల నుంచి తెచ్చుకున్న స్టాక్‌కు కొత్త ధరలు అమలు చేయడంలో భాగంగా వివరాలు తీసుకున్నారు. నూతన ధరల ప్రకారం ఆ స్టాక్‌కు అనుగుణంగా దుకాణదారులు ప్రభుత్వానికి పన్ను చెల్లించాల్సి ఉంటుంది.