అలంపూర్: అలంపూర్ జోగులాంబ (Jogulamba Temple ) ఆలయ ఉప ప్రధాన అర్చకుడు ఆనంద్ శర్మ ( Anand Sharma ) సస్పెన్షన్ (Priest Suspension) గురయ్యారు. అర్చకుడిపై వచ్చిన పలు రకాల ఆరోపణలపై దేవాదాయ శాఖ విచారణ చేపట్టి ఈ నిర్ణయం తీసుకున్నది. తక్షణమే అర్చకుడిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
చర్యల్లో భాగంగా అర్చకుడు జిల్లాను వదిలి వెళ్లకూడదని ఆంక్షలు విధించింది. విధుల్లో ఉన్నప్పుడు వివిధ పూజా కార్యక్రమాలకు సంబంధించిన ఆలయాలకు సంబంధించిన అలంకరణ ఆభరణాలు, వస్తువులు ఆలయానికి అప్పగించాలని ఆదేశాలు జారీ చేసింది. మిగిలిన ఆరోపణలపై విచారణ కొనసాగుతుందని దేవాదాయ శాఖ స్పష్టం చేసింది. ఆలయ ప్రతిష్టకు భంగం కలిగించేలా ఆనంద్ శర్మ అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి.