(నమస్తే తెలంగాణ): కరీంనగర్ శివారులోని మల్కాపూర్‌కు చెందిన చింతల రాజయ్య అలియాస్ రాజు (49) అనే అక్షర చిట్ ఫండ్ ఏజెంట్ ఆత్మహత్య చేసుకున్నా డు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. రాజు చిట్స్, ఎల్ఐసీ ఏజెంటుగా పనిచేస్తున్నాడు. అక్షర చిట్స్‌లో పలువురిని చేర్పించడంతోపాటు తన కు సంబంధించిన రూ.5 లక్షలు, తన సోదరికి సంబంధించిన రూ.5 లక్షలు డిపాజిట్లు చేయించాడు.
చిట్స్ కంపెనీ ఇటీవల మూసి వేయడం, పోలీసులు ఆస్తులు సీజ్ చేయడంతో చిట్స్‌లో స భ్యులుగా చేర్పించిన కొందరు డబ్బు లు ఇప్పించాలని రాజుపై ఒత్తిడి తెచ్చా రు. దీంతో చిట్స్ కంపెనీ నిర్వాహకుల వద్దకు వెళ్లి ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోకపోవడం, ఫోన్లు చేసినా ఎత్తకపోవడంతో తన డబ్బు, సోదరి డబ్బు రాదనే బెంగతో శనివారం తన ఇంటివద్ద చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
రాజుకు భార్య, ఇద్దరు కొడుకులు ఉన్నారు. భార్య లావణ్య ఫిర్యాదు మేరకు కొత్తపల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.రాజు కు టుంబానికి న్యాయం చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.