ఎదులాపురం, అక్టోబర్ 31: మధ్యాహ్న భోజన కార్యికుల సమస్యలు పరిషరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని ఏఐటీయూసీ జిల్లా నాయకుడు రాములు ఆరోపించారు. శుక్రవారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన కార్మికులకు పెండింగ్‌లో ఉన్న బిల్లులు, వేతనాలు విడుదల చేయాలనే డిమాండ్‌తో కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హోరెత్తించారు.
ఈ సందర్భంగా జిల్లా నాయకుడు కుంటాల రాములు మాట్లాడుతూ..జూన్‌లో పాఠశాలలు పునఃప్రారంభమైన నాటి నుంచి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మధ్యాహ్న భోజనాన్ని కార్మికులు అందిస్తున్నారని, కానీ ఇప్పటి వరకూ వారికి బిల్లులు, వేతనాలు రాలేదన్నారు. కొన్ని నెలలుగా కోడిగుడ్ల బిల్లులు, వేతనాలు ఇవ్వకపోవడంతో భోజనం ఎలా పెడుతారని ప్రశ్నించారు.
ఏఐటీయూసీ రాష్ట్ర నాయకత్వం కమిషనర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించిన సమయంలో బడ్జెట్ విడుదల చేశామని చెప్పారన్నారు. అన్ని జిల్లాలకు బడ్జెట్‌కు వచ్చిన ఇకడ మాత్రం కార్మికుల ఖాతాల్లో ఎందుకు జమ చేయలేదని ప్రశ్నించారు. ఇన్చార్జి డీఈవో ఎప్పుడు కార్యాలయంలో అందుబాటులో ఉండడం లేదని, ఇక సమస్య ఎవరికి చెప్పాలని ప్రశ్నించారు. కార్మికులకు బిల్లులు విడుదల చేయలేదంటే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన కార్మిక సంఘం నాయకులు సుజాత, లక్ష్మి యశ్వంత్రవు, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.