న్యూస్‌నెట్‌వర్క్, అక్టోబర్ 23: పెండింగ్‌లో ఉన్న సాలర్షిప్లు, ఫీజురీయింబర్స్‌మెంట్‌ను విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల ఎదుట విద్యార్థులతో కలిసి ధర్నాలు నిర్వహించారు. రేవంత్‌రెడ్డి స రారు విద్యారంగాన్ని పూర్తిగా విస్మరించడంతో వేలాది మంది పేద విద్యార్థులు ఉన్నత చదువులకు దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నదని ఆరోపించారు. ఈ నెల 27లోపు సమస్య పరిష్కరించక పోతే చలో ఇందిరాపార్ నిర్వహిస్తామని హె చ్చరించారు. హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, మేడ్చల్, నిజామాబా ద్, కరీంనగ ర్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూ డెం, యాదాద్రి భువనగిరి కలెక్టరేట్ల ఎదు ట, నారాయణపేట జిల్లా మక్తల్ తహసీల్ కార్యాలయం వద్ద, సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో ధర్నా నిర్వహించారు. ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఎల్బీనగర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు.