ఆయుష్షును హరిస్తున్న కాలుష్య రక్కసి
భారత్లో ప్రజారోగ్యానికి వాయు కాలుష్యం పెనుముప్పుగా పరిణమిస్తున్నది.
- 5 ఏండ్లు తగ్గనున్న భారతీయుడి ఆయుర్దాయం
- చికాగో యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నివేదిక హెచ్చరిక
న్యూఢిల్లీ, జూన్ 14: భారత్లో ప్రజారోగ్యానికి వాయు కాలుష్యం పెనుముప్పుగా పరిణమిస్తున్నది. పారిశ్రామికీకరణ, అధిక వాహనాలతో పెరిగిన ఇంధన వినియోగం.. ఇలా కారణం ఏదైతేనేం దేశంలో గాలి కాలుష్య తీవ్రత అధిక స్థాయిలో పెరిగిపోతున్నది. కాలుష్యం కారణంగా వచ్చే అనారోగ్యంతో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇదే సమయంలో విపరీతమైన ఈ కాలుష్యం వల్ల సగటు మనిషి ఆయుష్షు కూడా తగ్గిపోతున్నది. భారత్లో కాలుష్య తీవ్రతకు సంబంధించి అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ చికాగోకు చెందిన ఎనర్జీ పాలసీ ఇన్స్టిట్యూట్(ఈపీఐసీ) మంగళవారం విడుదల చేసిన ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్(ఏక్యూఎల్ఐ) నివేదికలో ఆందోళనకర విషయాలు వెల్లడించింది.
భారత్లో సగటు పౌరుడి ఆయుర్దాయం భారీగా తగ్గిపోయే ప్రమాదం ఉందని, అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) ప్రమాణాలు పాటిస్తే ఆయుష్షు మెరుగయ్యే అవకాశం ఉందని పేర్కొన్నది. దేశంలోనే అత్యధిక కాలుష్య నగరంగా ఉన్న రాజధాని ఢిల్లీలో కాలుష్య స్థాయి ప్రస్తుతం ఉన్న విధంగానే కొనసాగితే ప్రజలు 10 ఏండ్ల ఆయుష్షు కోల్పోతారని నివేదిక వెల్లడించింది. ఉత్తర భారతదేశంలో 51 కోట్ల మంది ఆయుర్దాయం 7.6 సంవత్సరాలు తగ్గే అవకాశం ఉందని అభిప్రాయపడింది.
దేశంలో తగ్గనున్న సగటు పౌరుడి ఆయుష్షు-5 ఏండ్లు
- దేశ రాజధాని ఢిల్లీలో-10 ఏండ్లు
- ఉత్తర భారతంలో-7.6 ఏండ్లు అధిక కాలుష్యానికి కారణాలు
- పారిశ్రామికీకరణ, పెరిగిన జనాభా, శిలాజ ఇంధనాల వినియోగం
పీఎం2.5 స్థాయిలు
- దేశంలో-56 మైక్రోగ్రామ్స్/క్యూబిక్ మీటర్
- ఢిల్లీలో -107 మైక్రోగ్రామ్స్/క్యూబిక్ మీటర్
- డబ్ల్యూహెచ్వో పరిమితి -5 మైక్రోగ్రామ్స్/క్యూబిక్ మీటర్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

