హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవం కానున్నది. ఈ స్థానానికి ఇండిపెండెంట్ అభ్యర్థి మహమ్మద్ రహీంఖాన్, ఏఐఎంఐఎం అభ్యర్థి రహమత్ బేగ్ నామినేషన్ దాఖలు చేశారు.
అధికార బీఆర్ఎస్ ఏఐఎంఐఎం అభ్యర్థికి మద్దతు ప్రకటించగా.. ఇతర పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ ఎన్నికకు దూరంగా ఉన్నాయి. నామినేషన్ పరిశీలనలో భాగంగా శుక్రవారం ఇండిపెండెంట్ అభ్యర్థి మహమ్మద్ రహీంఖాన్ నామినేషన్ తిరస్కరణకు గురైంది. తన నామినేషన్ పత్రాలో పది మంది బలపరిచిన వారు ఓటర్లు కానందున తిరస్కరించినట్టు అధికారులు ప్రకటించారు. దీంతో రహమత్ బేగ్ ఎన్నిక ఏకగ్రీవమే కానున్నది.