హైదరాబాద్, జూన్ 22 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని 10 ఇంజినీరింగ్ కాలేజీల్లో లోపాలుండటం, నిబంధనల ప్రకారం లేకపోవడంతో అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) అనుమతులు ఇవ్వలేదు. 2025-26 విద్యాసంవత్సరానికి ఏఐసీటీఈ అప్రూవల్స్ జారీచేస్తున్నది. ఈ సారి రాష్ట్రం నుంచి 170కి పైగా ఇంజినీరింగ్ కాలేజీలు ఏఐసీటీఈకి అనుమతుల కోసం దరఖాస్తు చేశాయి. ఈ కాలేజీలకు అనుమతులిచ్చే ముందు వర్చువల్ ఇన్స్పెక్షన్లు నిర్వహించింది.
ఈ తనిఖీల్లో పలు లోపాలు వెలుగుచూశాయి. దీంతో 10 ఇంజినీరింగ్ కాలేజీలకు గుర్తింపును ఏఐసీటీఈ పెండింగ్‌లో పెట్టింది. ఈ రెండు మూడు రోజుల్లో ఎప్‌సెట్ వెబ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలకానున్నది. ఈ నెల 30లోపు కాలేజీలకు గుర్తింపునిస్తామని ఏఐసీఈటీ ప్రకటించింది. మరో వారం రోజుల్లో ఆయా కాలేజీలకు గుర్తింపు దక్కుతుందా..? లేదా అన్నది సస్పెన్స్‌గా మారింది.