హైదరాబాద్, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ లోక్‌సభా పక్షనేత రాహుల్‌గాంధీ మాట మేరకు దేశానికే ది క్సూచిలా తెలంగాణ నిలిచేలా సర్వే నిర్వహించాలని కాంగ్రెస్ నేతలు పదే పదే మాటల కోటలు కట్టారు. కులగణన చేపట్టింది మొదలు, సర్వే లెక్కలను అసెంబ్లీకి నివేదించే వరకూ రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ప్రగల్భాలు పలికారు. కానీ, ఆచరణలో రాహుల్‌గాంధీ ప్రవచనాలకు పా తరేశారు. పూర్తిభిన్నంగా బ్యూరోక్రటిక్ కులగణనను కాంగ్రెస్ సర్కారు నిర్వహించింది. శాస్త్రీయత పాటించకుండా కంటితుడుపుగా సర్వే చేపట్టి, కాకిలెక్కలను చెప్పి మమ అనిపించారని సర్వ త్రా విమర్శలు వినిపిస్తున్నాయి. యావ త్ తెలంగాణ సమాజం కాంగ్రెస్ సర్కా రు వ్యవహారశైలిపై దుమ్మెత్తిపోస్తున్నది.
ఇంటింటి సర్వేకు ప్లానింగ్ డిపార్ట్మెంట్ రూపొందించిన ప్రశ్నావళిపై ఆదిలోనే అనేక వర్గాలు, కుల సంఘాలు, కా ర్మిక సంఘాలు అభ్యంతరాలు వ్యక్తం చే శాయి. విశ్వబ్రాహ్మణ విశ్వకర్మలను ఒకే కులస్తులుగా పరిగణించాలని తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ మాతృ సంఘం డిమాండ్ చేసింది. వారిని కులంగా కాకుండా వృత్తులుగా పేరొనడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. సం ప్రదాయ వృత్తులైన కమ్మరం, వడ్రంగం, ఇత్తడి, శిల్పి, స్వర్ణకార వృత్తులు చేస్తున్నవారందరినీ విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ జాతీయులుగానే గుర్తించాల్సి ఉన్నా, సర్వే ప్రశ్నావళిలో పంచవృత్తులకు బదులుగా సంప్రదాయ వృత్తుల జాబితాలో కమ్మరం, వడ్రంగి, స్వర్ణకార వృత్తులనే కులాలుగా ముద్రించడాన్ని ఆక్షేపించిం ది. ఇత్తడి, శిల్పి వృత్తులను విస్మరించిం ది. దానిని సవరించాలని ఆ సంఘం డిమాండ్ చేసినా పట్టించుకోలేదు.
అదేవిధంగా తెలంగాణ గిగ్, ప్లాట్‌ఫామ్ వ రర్స్ యూనియన్(టీజీపీడబ్ల్యూయూ) కూడా పలు సూచనలు ముందుపెట్టిం ది. ‘రోజువారీ వేతన కార్మికులు’ అనే కోడ్ శీర్షికను ‘అసంఘటిత విభాగం కా ర్మికులు/ వేతన కార్మికులు’గా మార్చాలని తెలిపింది. గిగ్, ప్లాట్‌ఫామ్ కార్మికులను వేర్వేరుగా స్వయం ఉపాధి కింద కోడ్లుగా వర్గీకరిస్తున్నారని, అలా కా కుండా కోడ్-4లోనే వర్గీకరించాలని డిమాండ్ చేసింది. మరికొన్ని శీర్షికల్లో నూ మార్పులు చేయాలని ప్రతిపాదించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ కుల సంఘాలు సైతం ఆమోదయోగ్యమైన, అర్థవంతమై న, సహేతుకమైన అనేక సూచనలను ప్రభుత్వం ముందుపెట్టాయి. అయినప్పటికీ ఇటు ప్రభుత్వం, అటు ప్లానింగ్ బోర్డు ఏ మాత్రం పట్టించుకోలేదు. ఇ ప్పుడు ఏకంగా అసంబద్ధమైన గణాంకాలు, అసమగ్ర సమాచారంతో నివేదిక ను కూడా వెల్లడించింది. ఇదేనా రాహుల్‌గాంధీ చెప్పిన ప్రజా కులగణన అని కాంగ్రెస్ తీరుపై మేధావులు, సామాజికవేత్తలు నిప్పులు చెరుగుతున్నారు. ఈ నివేదిక కచ్చితత్వం, ప్రామాణికతను కోల్పోయిందని, మొత్తంగా సర్వే ఉద్దేశం నెరవేరడమే ప్రశ్నార్థకంగా మారిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కులగణన అంశంపై ప్రజాసంఘా లు, కుల సంఘాలు, సామాజికవేత్తల అభిప్రాయాలను తెలుసుకునేందుకు రాహుల్‌గాంధీ హడావుడిగా మహా రాష్ట్ర ఎన్నికలకు ముందు తెలంగాణకు విచ్చేశారు. మేధావివర్గం, ప్రజాసంఘాలు, కులసంఘాల నేతలతో భేటీ అయి సుదీర్ఘంగా చర్చించారు. కులగణన ఏ రీతిలో ఉండాలి? ఏ విధానాలను అవలంబించాలి? ఏ పద్ధతిలో సర్వే నిర్వహించాలి? తదితర అంశాలను స్పష్టంగా నొక్కిచెప్పారు. అధికా ర యంత్రాంగం తీర్చిదిద్దిన ప్రశ్నావళితో, రూపొందించిన నియమనిబంధనలతో కుల సర్వేను నిర్వహించవద్దని స్పష్టంగా చెప్పారు. ప్రజల ఆలోచనలకు అనుగుణంగా ప్రశ్నలను రూపొందించి, అవసరమైతే వారి నుంచే ప్రశ్నలను స్వీకరించి ప్రశ్నావళిని తయారు చేసి ప్రజా కులగణన నిర్వహించాలని తెలిపారు. రాష్ట్రంలో రేవంత్ సర్కారు మాత్రం అందుకు విరుద్ధంగా సర్వే ని ర్వహించింది. బ్యూరోక్రటిక్గానే సర్వే ను కొనసాగించిందే తప్ప ఎక్కడా ప్రజాభిప్రాయాలు, కులసంఘాల సూచనలు పాటించలేదు. ప్లానింగ్ డిపార్ట్మెంట్ రూపొందించిన ప్రశ్నావళితోనే సర్వే పూర్తిచేయడమే కాదు, నివేదికను కూడా వెల్లడించిం ది. అయినా రాహుల్ మాట మేరకే చేశామంటూ కాంగ్రెస్ ఇప్పుడు ప్రగల్భాలు పలుకుతుండటంపై విమర్శలొస్తున్నాయి.