హైదరాబాద్, డిసెంబర్ 12(నమస్తే తెలంగాణ) : ఏఐసీసీ రాష్ట్ర ఇన్చార్జీల వ్యవహార శైలిపై కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి వారి ఎదుటనే తీవ్ర అసహనం, ఆగ్రహం వ్యక్తంచేసినట్టు తెలిసింది. ఇన్చార్జీల ఇష్టారీతి నిర్ణయాలు, నియామకాలు, సిఫారసులపై తీవ్రస్థాయిలో మండిపడినట్టు తెలిసింది. ఏఐసీసీ ఇన్చార్జీలంతా కలిసి పార్టీని నాశనం చేస్తా రా? అని అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసిం ది. బుధవారం ఒక వివాహ వేడుకలో ఏఐసీసీ కార్యదర్శి విష్ణు.. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి తారసపడ్డారు. ఈ సందర్భంగా విష్ణుపై జగ్గారెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడినట్టు తె లిసింది. ‘ఇన్చార్జీలంతా కలిసి పార్టీని చంపేయాలని చూస్తున్నారా? ఇంతకీ మీరు ఏఐసీసీ కార్యదర్శిగా ఉన్నారా? వేరే రాష్ట్రం వెళ్లిపోయారా?’ అని జగ్గారెడ్డి నిలదీసినట్టు తెలిసింది.
దీంతో ‘మెదక్ జిల్లా బాధ్యతలు కూడా నేనే చూస్తున్న’ అంటూ విష్ణు బదులిచ్చినట్టు తెలిసింది. ‘పార్టీ ఇన్చార్జి దీపాదాస్ మున్షీ కూడా ఉన్నారా? వేరే రా ష్ట్రం పోయారా? అధికార పార్టీ ఇన్చార్జీలు అంటే ఇలాగేనా ఉండేది? మీరేం చేస్తున్నారో మీకైనా అర్థం ఆవుతున్నదా?’అని నిలదీసినట్టుగా తెలిసింది. నామినేటెడ్ పోస్టుల భర్తీ వి షయంలో ఇన్చార్జీల జోక్యంపై ఆయన తీ వ్రంగా మండిపడిట్టు తెలిసింది. కొత్తకొత్త వా ళ్లకు పదవులు సిఫారసు చేస్తున్నారని, ఏండ్లు గా పార్టీని నమ్ముకున్న వారి పరిస్థితి ఏమిటని ప్రశ్నించినట్టు తెలిసింది. నియామకాలపై సీనియర్ నేతలైనా తమకు చెప్పడం లేదని, ని యామకాలు పూర్తయిన తర్వాతే తమకు తెలుస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేసినట్టు తెలిసింది. ఇదే పరిస్థితి కొనసాగితే సహించేది లేదని గట్టిగానే చెప్పినట్టు సమాచారం.