AICC | తెలంగాణ ప్రదేశ్ నూతన కార్యవర్గాన్ని ఏఐసీసీ సోమవారం ప్రకటించింది. 27 మంది ఉపాధ్యక్షులకు టీపీసీసీ కార్యవర్గంలో చోటు లభించింది. 69 మంది ప్రధాన కార్యదర్శులకు టీపీసీసీ చోటు కల్పించినట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. కార్యవర్గం ఎంపికకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆమోద ముద్ర వేశారని పేర్కొన్నారు. ఉపాధ్యక్షులుగా ఎంపీ రఘువీర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, చిక్కుడు వంశీకృష్ణ, ఎమ్మెల్సీలు బల్మూరి వెంకట్, బస్వరాజు సారయ్యకు అవకాశం ఇచ్చింది. ప్రధాన కార్యదర్శుల్లో ఎమ్మెల్యేలు వెడ్మ బొజ్జు, సీహెచ్ పర్ణికరెడ్డి, మట్టా రాగమయికి అవకాశం కల్పించింది.
కార్యవర్గం ఇదే..