హైదరాబాద్, జనవరి 29 (నమస్తే తెలంగాణ) : ఇందిరమ్మ ఇండ్ల పథకంలో అవినీతి, అక్రమాలకు తావులేకుండా చేయడంతోపాటు లబ్ధిదారులకు మేలు చేసేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని ఆ శా ఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. లబ్ధిదారుల ఎం పిక నుంచి ఇండ్ల నిర్మాణం పూర్తయ్యే వరకు కృత్రిమమేధను (ఏఐ) వాడుకోవాలని సూచించారు. ఇందిరమ్మ ఇండ్ల పథకంపై బుధవారం మంత్రి పొంగులేటి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాలుగు దశల్లో చెల్లింపులు చేస్తామని వెల్లడించారు.
హైదరాబాద్, జనవరి 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వేసవికాలంలో తాగునీటి సమస్యలు తల్తెతకుండా తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. ఎర్రమంజిల్లో బుధవారం మిషన్ భగీరథపై మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తాగునీటి సమస్యల పరిష్కారం కోసం కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా తాగునీటి సరఫరా ఇంజినీర్స్ అసోసియేషన్ డైరీని మంత్రి సీతక్క ఆవిష్కరించారు.