హైదరాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ): దేశంలోకి ఈ ఏడాది రుతుపవనాలు ముందుగానే రావడంతో సా ధారణ స్థాయి కంటే అధిక వర్షపాతం నమోదైంది. దేశవ్యాప్తంగా అనుకూలమైన వాతావరణం ఉండటంతో ఖరీఫ్ పంటల విస్తీర్ణం 7 నుంచి 11% మేరకు పెరుగుతుందని అంచనా వేశారు. కానీ, తెలంగాణలో మాత్రం పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉన్నది. 2020 ఖరీఫ్ సీజన్లో సెప్టెంబర్ చివరి నాటికి రాష్ట్రంలో మొత్తం 133.55 లక్షల ఎకరాలకు.. ఈ ఏడాది 3.55 లక్షల ఎకరాలు తగ్గినట్టు వారాంతపు నివేదికలో వ్యవసాయ శాఖ వెల్లడించిన గణాంకాలు స్పష్టం చేస్తున్నా యి. జూన్, జూలైలో ఏర్పడిన కరువుతోపాటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని సాగు భూములకు కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నుంచి నీరు విడుదల కాకపోవ డం, తక్కువ నీరు అవసరమయ్యే పం టల వైపు రైతులు మొగ్గు చూపడం ప్రధా న కారణంగా కనిపిస్తున్నది.
సూర్యాపేట జిల్లాలో వాస్తవ పంట విస్తీర్ణం నిర్దిష్ట లక్ష్యంలో 95.43 శాతంగా ఉన్నది. పెద్దపల్లి, మేడ్చల్-మలాజిగిరి, యాదాద్రి-భువనగిరి, రంగారెడ్డి, వనపర్తి సహా 18 జిల్లాల్లో సాధారణ స్థాయి కంటే స్వ ల్పంగా తగ్గింది. ఎస్సారెస్పీకి ఆలస్యంగా నీరు విడుదల కావడం సూర్యాపేట, యాదాద్రి-భువనగిరి జిల్లాల్లో పంటల సాగుపై ప్రభావం చూపినప్పటికీ వరి విస్తీర్ణం స్వల్పంగా పెరిగి 66.78 లక్షల ఎకరాల నుంచి 67.30 లక్షల ఎకరాల కు చేరుకున్నది. పప్పుధాన్యాల సాగు 5.84 లక్షల ఎకరాల నుంచి 6.16 లక్షల ఎకరాలకు, పత్తి విస్తీర్ణం లక్ష ఎకరాలకుపైగా పెరిగింది. ఈ నెలలో కురిసిన వర్షా ల వల్ల ఈ పురోగతి నమోదైనట్టు గణాంకాలు వెల్లడించాయి. అయినప్పటికీ కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుసంధానించిన జలాశయాల్లోకి నీటిని పంపింగ్ చేయకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా వరి లాంటి వర్షాధార పంటల సాగు 10-15% మేర కు తగ్గింది. సెప్టెంబర్లో కూడా నికర విస్తీర్ణం 10% తకువగా ఉన్నది.
యూరియా కొరతతో..
ఆగస్టులో యూరియా కొరత గరిష్ఠ స్థాయికి చేరడం మహబూబాబాద్ లాంటి జిల్లాల్లో నాట్లు, పంటల విస్తరణపై తీవ్ర ప్రభావం చూపింది. రైతులు 5 నుంచి 10% భూములను సాగు చేయకుండా వదిలిపెట్టారు. జూన్, జూలై లో వర్షపాభావ పరిస్థితుల వల్ల పంటల సాగు ఆలస్యమైంది. కానీ, ఆ తర్వాత కురిసిన అధిక వర్షాలతో రైతులు కోలుకున్నారు.