ఫీజు వసూలుకు కొత్త సాఫ్ట్వేర్.. వ్యవసాయ మార్కెటింగ్ శాఖ వెల్లడి
మార్కెట్ ఫీజు వసూలుకు కొత్త సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసేందుకు చర్యలు ప్రారంభించినట్టు వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారులు తెలిపారు. మార్కెటింగ్ శాఖలో ఫీజుల మాయజాలంపై ‘నమస్తే తెలంగాణ’ గురువారం ప్రచురించిన ‘మార్కెట్ ఫీజు మాయాజాలం!
- ‘నమస్తే తెలంగాణ’ కథనానికి స్పందన
హైదరాబాద్, జూలై 17 (నమస్తే తెలంగాణ) : మార్కెట్ ఫీజు వసూలుకు కొత్త సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసేందుకు చర్యలు ప్రారంభించినట్టు వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారులు తెలిపారు. మార్కెటింగ్ శాఖలో ఫీజుల మాయజాలంపై ‘నమస్తే తెలంగాణ’ గురువారం ప్రచురించిన ‘మార్కెట్ ఫీజు మాయాజాలం!’ కథనం ఆ శాఖలో చర్చనీయాంశమైంది. ఈ కథనంపై ఉన్నతాధికారులు ఆరా తీసినట్టు తెలిసింది. వ్యవసాయ మార్కెటింగ్ శాఖలో వ్యాపార కార్యకలాపాల కంప్యూటరీకరణ బాధ్యతలను హైదరాబాద్‌కు చెందిన ఎల్‌ఐఎల్ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్‌కు సాఫ్ట్వేర్ అభివృద్ధికి అనుమతి ఇచ్చినట్టు తెలిపింది. పారదర్శకత, పర్యవేక్షణ, సామర్థ్యాన్ని పెంచడమే దీని ఉద్దేశమని పేర్కొన్నది.
మార్కెట్ ఫీజు, అద్దెలు, లైసెన్స్ ఫీజు, జరిమానాలు, తక్కపట్టీ విక్రయాలు, పర్మిట్ పుస్తకాలు, ఉద్యోగుల రుణ వసూళ్లకు ఈ-రిసిప్ట్స్ జారీ చేస్తున్నట్టు తెలిపారు. గత మూడేండ్లలో ఈ-రిసిప్ట్స్ ద్వారా వసూళ్ల వివరాలు వెల్లడించారు. 2023-24లో 4,43,643 ఈ-రిసిప్టుల ద్వారా రూ.1,225.03 కోట్లు, 2024-25లో 4,41,712 రిసిప్టుల ద్వారా రూ.1,063.09కోట్లు, 2025-26లో 4,15,263 రిసిప్టులకు రూ.867.13 కోట్ల ఆదాయం సమకూరినట్టు వివరించారు.
2025-26లో(జూలై 15 నాటికి) 1,34,711 రిసిప్టులకు రూ.295.18 కోట్లు ఆదాయం సమకూరినట్టు అధికారులు తెలిపారు. మ్యానువల్‌గా వసూలు చేసిన నాటి నుంచి ఈ-రిసిప్ట్స్ కాలం వరకు ఖజానాలో మార్కెట్ ఫీజు జమ చేయడంలో విఫలమైన సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నట్టు చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI | ఎవరిదో ఫైనల్ పంచ్.. నేడు భారత్-వెస్టిండీస్ చివరి టీ20!
Starlink vs Jio | పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
Nominated Posts | నీకు పదవొస్తే.. నాకెంతిస్తావ్.. వరంగల్ సహా దక్షిణాది జిల్లాల్లో పదవికో రేట్!
Build Now Rules | వంద గజాల ప్లాట్ల యజమానులకు షాక్.. 30 ఫీట్ల రోడ్డు లేకపోతే ఇల్లు కట్టలేరు
Vote | నేను బతికే ఉన్నా.. 11 ఎన్నికల్లో ఓటు వేస్తే.. ఇప్పుడు నోటీసులు ఇస్తరా?.. ‘సర్’పై వృద్ధుడి నిరసన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

