హైదరాబాద్, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ): ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో సోమవారం మెగా స్నాతకోత్సవం నిర్వహించనున్నట్టు ఆ వర్సిటీ వీసీ ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య తెలిపారు. రాజేంద్రనగర్‌లోని విశ్వవిద్యాలయం స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో గవర్నర్, విశ్వవిద్యాలయం కులపతి జిష్ణుదేవ్‌వర్మ అధ్యక్షతన నిర్వహించనున్నట్టు శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు.