హైదరాబాద్, ఆగస్టు 15: అగ్ని క్షిపణి పితామహుడిగా గుర్తింపు పొందిన ఆర్ఎన్ అగర్వాల్ (84) గురువారం హైదరాబాద్‌లో కన్నుమూశారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆయన నేతృత్వంలో 1983లో అగ్ని క్షిపణి తయారీ ప్రోగ్రాంను భారత్ మొదలుపెట్టింది. ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి సామర్థ్యం కలిగిన దేశాల సరసన భారత్‌ను నిలపటంలో ఆయన కృషి ఉంది.
ప్రస్తుతం అత్యంత శక్తివంతమైన క్షిపణి ‘అగ్ని-5’ రేంజ్ 5వేల కిలోమీటర్లు. అగ్ని మిస్సైల్ మ్యాన్‌గా, అగ్నివాల్గా ఆయన గుర్తింపు పొందారు. భారత ప్రభుత్వం ఆయనను పద్మభూషణ్‌తో సత్కరించింది. అగ్ని, పృథ్వి, ఆకాశ్, నాగ్, త్రిశూల్ క్షిపణి తయారీ ‘ఐజీఎండీపీ’లో ఆయన పాలుపంచుకున్నారు.