Food Poison | నారాయణపేట జిల్లా మాగనూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మరోసారి ఫుడ్పాయిజన్ జరిగింది. మంగళవారం నాడు మధ్యాహ్న భోజనం తిని 40 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్నం 3.30 గంటల తర్వాత పలువురు విద్యార్థులు తీవ్రమైన కడుపు నొప్పితో విలవిలలాడిపోయారు. వాంతులు, విరేచనాలతో ఇబ్బంది పడ్డారు. ఇది గమనించిన పాఠశాల సిబ్బంది, తల్లిదండ్రులు విద్యార్థులను ఆస్పత్రికి తరలించారు.
మాగనూరు పీహెచ్సీలో విద్యార్థులకు చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉన్న పలువురిని మక్తల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మాగనూరులో ఫుడ్ పాయిజన్ జరగడం ఈ వారంలో ఇది మూడోసారి. దీనిపై స్థానికులు, విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు
మక్తల్ – మాగనూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మళ్లీ ఫుడ్ పాయిజన్ https://t.co/uS3KEI2Wvw pic.twitter.com/6AQJh9frD5
— Telugu Scribe (@TeluguScribe) November 26, 2024
మరోవైపు, మహబూబ్నగర్ కలెక్టర్ బంగ్లా దగ్గర ఉన్న ఎస్సీ బాలిక కాలేజీ హాస్టల్లో విద్యార్థులకు పెడుతున్న అన్నంలో పురుగులు వచ్చాయి. దీనిపై విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. సమాచారం తెలుసుకున్న ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ నాయకులు హాస్టల్కు చేరుకుని విద్యార్థులతో మాట్లాడారు. ప్రతిరోజు ఇలానే భోజనంలో పురుగులు వస్తున్నాయని విద్యార్థులు చెప్పారు.