రాజన్న సిరిసిల్ల: రైతు పండించిన పంటను ఆన్లైన్లో నమోదు చేసేందుకు లంచం అడిగిన ఓ వ్యవసాయ విస్తరణాధికారిపై సస్పెన్షన్ వేటుపడింది. డబ్బులు లంచంగా తీసుకుంటున్న వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌కాగా, రాజన్నసిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి వెంటనే స్పందించారు. లంచగొండి అధికారిని సస్పెండ్ చేశారు.
తంగళ్లపల్లి మండలం తాడూర్ క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారిగా అజీజ్ ఖాన్ పనిచేస్తున్నారు. స్థానిక రైతులు తమ పంటను ఆన్లైన్లో నమోదు చేయాలని కోరగా, అజీజ్‌ఖాన్ లంచం డిమాండ్ చేశాడు. ఫోన్ పే, గూగుల్ పే ద్వారా వసూళ్లకు పాల్పడ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఆన్లైన్లో చక్కర్లు కొట్టింది. ఈ వీడియో చూసిన కలెక్టర్ అనురాగ్ జయంతి వెంటనే స్పందించారు. వ్యవసాయ విస్తరణాధికారి అజీజ్ ఖాన్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.