బండ్లగూడ,అక్టోబర్ 29 : రాజేంద్రనగర్ ఇంజినీరింగ్ విభాగంలో పనిచేసిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ వెంకోబ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) పోలీసులకు పట్టుబడ్డారు. వెంకోబ నెల క్రితమే రాజేంద్రనగర్‌లోని జీహెచ్ఎంసీ కార్యాలయం నుంచి సర్కిల్ 14కు బదిలీ అయ్యారు. రాజేంద్రనగర్‌లో పరిధిలో ఎంబిల్ రాసేందుకు ఒక కాంట్రాక్టర్ నుంచి రూ.50 వేలు డిమాండ్ చేశారు. దీంతో సదరు కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను సంప్రదించారు. వారి సూచనల మేరకు వెంకోబకు కాంట్రాక్టర్ డబ్బులు ఇస్తుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వెంకోబ రాజేంద్రనగర్ జీహెచ్ఎంసీ కార్యాలయంలో పదేండ్లకుపైగా పనిచేశారు.