సుబేదారి, మే 25 : డబుల్ బెడ్రూమ్ ఇండ్ల బిల్లుల మంజూరు కోసం లంచం తీసుకుంటూ ఇరిగేషన్ శాఖ డీఈ ఏసీబీ అధికారులకు సోమవారం పట్టుబడ్డాడు. ఏసీబీ వరంగల్ రేంజ్ డీఎస్పీ సాంబయ్య తెలిపిన వివరాల ప్రకారం.. మహబుబాబాద్ జిల్లా పెద్ద వంగర మండలం కాన్వాయిగూడెంలో పది డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణ బిల్లుల చెల్లింపుల కోసం కాంట్రాక్టర్‌ను జనగామ జిల్లా పాలకుర్తి ఇరిగేషన్ శాఖ డీఈ గంటి శ్రీకాంత్ రూ. 50 వేలు లంచం డి మాండ్ చేశాడు.
సోమవారం హనుమకొండ భవానీనగర్‌లోని తన నివాసంలో కాంట్రాక్టర్ నుంచి డీఈ శ్రీకాంత్ డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వరంగల్ ఏసీబీ కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు తరలించినట్టు ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపారు.