బొల్లారం, జూన్ 17: ఓ వ్యక్తి వద్ద నుంచి లంచం తీసుకుంటూ బొల్లారం విద్యుత్తుశాఖ ఏఈ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. మెదక్ ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా బొల్లారం డివిజన్లో విద్యుత్తుశాఖ అసిస్టెంట్ ఇంజినీర్‌గా రామకృష్ణారెడ్డి విధు లు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల డివిజన్లోని వైఎస్సార్‌కాలనీ సమీపంలో జరిగిన ప్రమాదంలో విద్యుత్తు స్తంభం దెబ్బతిన్నది.
ఈ ఘటనపై పోలీసు కేసు నమోదు కాకుండా ఉండేందుకు ఓ వ్యక్తి నుంచి ఏఈ రామకృష్ణారెడ్డి రూ.25వేలు డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ అధికారుల సూచన మేరకు బాధితుడు గురువారం ఏఈకి డబ్బులు ఇస్తుండగా అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ మేరకు రామకృష్ణారెడ్డిని అరెస్టు చేసి నాంపల్లి కోర్టులో హాజరుపరుస్తామని ఏసీబీ డీఎస్పీ తెలిపారు.