హైదరాబాద్, మే 19 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పెద్ద కుమారుడు ఆదిత్య అమెరికాలోని ఓక్ ఫారెస్ట్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పట్టా అందుకున్నారు. ఇటీవల అమెరికాలో జరిగిన గ్రాడ్యుయేషన్ కార్యక్రమానికి ఎమ్మెల్సీ కవిత, అనిల్ కుమార్ దంపతులు హాజరయ్యారు. ఆదిత్య గ్రాడ్యుయేషన్ పట్టా పుచ్చుకున్న ఫొటోను ఎమ్మెల్సీ కవిత సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసి, ఆనందాన్ని వ్యక్తంచేశారు.
‘ఆదిత్యా నీ చిట్టి చేతిని పట్టుకోవడం నుంచి నువ్వు డిగ్రీ పట్టా పట్టుకోవడం వరకు చూశాను. ఇది ఎంతో గొప్ప ప్రయాణం. నువ్వు చాలా కష్టపడ్డావు. ఎంతో ఎదిగావు. మేమందరం గర్వపడేలా చేశావు’ అని ‘ఎక్స్’లో పేర్కొన్నారు. ఒక త ల్లిగా ఎంతో గర్వపడుతున్నానని సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం అమెరికాలోనే ఉన్న ఎమ్మెల్సీ కవిత ఈనెల 23న హైదరాబాద్కు చేరుకోనున్నారు.