హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లోని ఆదిత్య కళాశాలలకు ఎలాంటి అనుబంధ గుర్తిం పు మంజూరు చేయలేదని ఉస్మానియా యూనివర్సిటీ పాలనాధికారులు శని వారం ఒక్క ప్రకటనలో తెలిపారు. ఉన్న త విద్యాశాఖ, ఉన్నత విద్యామండలి అధికారిక విద్యాసంస్థల ఆమోదం లేకుండా ఆదిత్య పేరిట జారీ అవుతున్న ప్రకటనలను విద్యార్థుల తల్లిదండ్రులు నమ్మవద్దని స్పష్టంచేశారు.
సదరు సంస్థ ల్లో చేరవద్దని సూచించారు. ఆదిత్య డిగ్రీ కాలేజీల వెనుక ముఖ్యనేత బంధువుల హస్తం ఉన్నదని తెలుస్తున్నది. ఇవి ఆం ధ్రాప్రాంతానికి చెందినవని సమాచారం. అనుమతి లేకున్నా పోస్టర్లు, సోషల్మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారు. ముఖ్యనేత దగ్గరి బంధువులు ఉన్నందునే చర్యలు లేవని సమాచారం.