ఐటీ రంగం విస్తృత పర్చడానికి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకున్నది. ఇందులో భాగంగా ఆదిలాబాద్ జిల్లా మావల మండలం బట్టిసావర్గాంలో మూడెకరాల్లో రూ. 40 కోట్లతో ఐటీ టవర్ను నిర్మాణాన్ని చేపట్టింది.
68 వేల చదరపు అడుగుల వైశాల్యంలో జీ ప్లస్ ఫోర్ భవనం నిర్మిస్తుండగా పనులు చివరి దశకు చేరుకున్నాయి. త్వరలోనే పలు కంపెనీలు ఈ టవర్లో తమ కార్యకలాపాలను ప్రారంభించే అవకాశాలు ఉండగా 1900 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి.