ఆదిలాబాద్, జూలై 8(నమస్తే తెలంగాణ): ఆదిలాబాద్ జిల్లా మావల మండలం బట్టిసావర్గాంలోని సర్వే నంబర్ 72/3 లో జరిగిన 11 అక్రమ రిజిస్ట్రేషన్లపై విచారణ చేపట్టాలని ఆదిలాబాద్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి శ్రీనివాస్‌రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం పులువురు కాంగ్రెస్ నాయకులతో కలిసి కలెక్టర్ రాజర్షిషా, ఎస్పీ అఖిల్‌మహాజన్‌కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం జారీచేసిన ఎన్వోసీ రద్దుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నూతన కలెక్టర్ కార్యాలయ భవన నిర్మాణానికి కేటాయించిన స్థలంలో జరిగిన భూ కబ్జాలపై సమగ్ర విచారణ జరిపించాలని, కబ్జాకు గురైన భూమిని ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకోవాలని సూచించారు. ఎస్పీని కలిసిన వారిలో ఆత్మ చైర్మన్ గిమ్మ సంతోష్, కాంగ్రెస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఇజ్జిగిరి సంజయ్, కౌన్సిలర్లు ఉన్నారు.