ADE Ambedkar | కోట్లకు పడగలెత్తిన ఏడీఈ అంబేద్కర్.. ఆస్తుల చిట్టా ఇదే
ADE Ambedkar | ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఆరోపణ నేపథ్యంలో విద్యుత్ శాఖ ఏడీఈ అంబేద్కర్ ఇంట్లో ఏసీబీ అధికారులు విస్తృతంగా సోదాలు నిర్వహించారు.
ADE Ambedkar | హైదరాబాద్ : ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఆరోపణ నేపథ్యంలో విద్యుత్ శాఖ ఏడీఈ అంబేద్కర్ ఇంట్లో ఏసీబీ అధికారులు విస్తృతంగా సోదాలు నిర్వహించారు. మంగళవారం తెల్లవారజాము నుంచి సాయంత్రం 5 గంటల వరకు విరామం లేకుండా సోదాలు నిర్వహించారు ఏసీబీ అధికారులు. ఏడీఈ అంబేద్కర్ నివాసంతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, బంధువుల నివాసాల్లో సోదాలు నిర్వహించారు. ఏసీబీ అధికారులు మొత్తం 15 బృందాలుగా విడిపోయి గచ్చిబౌలి , మాదాపూర్ , హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, నల్గొండ జిల్లాల్లో పలుచోట్ల సోదాలు చేపట్టి.. ఆస్తుల వివరాలు సేకరించారు. అంబేద్కర్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.
ఏడీఈ అంబేద్కర్ కోట్లకు పడగలెత్తినట్లు ఏసీబీ అధికారులు నిర్ధారించారు. శేరిలింగంపల్లిలో ఒక ఫ్లాట్, గచ్చిబౌలిలో జీ ప్లస్ 5 భవనం, పది ఎకరాల్లో అమ్తర్ కెమికల్స్ ఫ్యాక్టరీ, హైదరాబాద్‌లో ఆరు రెసిడెన్షియల్ ప్రైమ్ ఓపెన్ ప్లాట్స్, ఒక వ్యవసాయ క్షేత్రం, రెండు కార్లు, బంగారు ఆభరణాలు, బ్యాంకు డిపాజిట్లు ఉన్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. ఇక అంబేద్కర్ బినామీ ఇంట్లో రూ. 2.18 కోట్ల నగదు పట్టుబడింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘రైతులకు 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్ అందించాలి’
Nic Maddinson | క్యాన్సర్‌ను జయించి 9 ఏళ్లకు పునరాగమనం.. 33 బంతులాడి డకౌట్..!
Mayookha | ‘మయూఖ’ మూవీ రివ్యూ.. భయపెట్టే సస్పెన్స్ థ్రిల్లర్!
‘పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తక్షణమే పరిహారం అందించాలి’
కరెంట్ లేక ఎండిపోతున్న పంటలు.. హద్నూర్ సబ్ స్టేషన్ ముట్టడించిన రైతులు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

