నల్లగొండ : సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీల కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ అన్నారు. ఆదివారం చందంపేట మండలం గన్నేర్లపల్లి గ్రామానికి చెందిన 60 కుటుంబాలు ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.
వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పేదల అభ్యున్నతికి టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన అన్నారు. రైతులకు నిరంతరం కరెంట్ అందించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని స్పష్టం చేశారు. నియోజకవర్గంలో లక్షా 60వేల ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యమన్నారు.
కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ సిరందాసు లక్ష్మమ్మ, జడ్పీటీసీ రమావత్ పవిత్ర, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు దొందేటి మల్లా రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ముత్యాల సర్వయ్య, రైతు బంధు అధ్యక్షుడు బోయపల్లి శ్రీనివాస్ గౌడ్, శిరందాసు కృష్ణయ్య, రమావత్ మోహన్ కృష్ణ, స్థానిక సర్పంచ్ కొండ్రపల్లి నాగార్జున్ పాల్గొన్నారు.